ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Attack On ABN Team: నిజాన్ని ఆపలేకపోయామనే ఫ్రస్టేషన్‌తోనే దాడి.. : ఏబీఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రేవతి

ABN, First Publish Date - 2023-05-19T14:20:19+05:30

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి తెలుగు ప్రజల కోసం లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తున్న ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై దాడిని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పాటు ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్‌లు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తున్న ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి (ABN- Andhrajyothy) ప్రతినిధిపై దాడిని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పాటు ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్‌లు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ (ABN- Andhrajyothy Edito Srinivas) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రేవతి (ABN - AndhraJyothy Executive Editor Revathi) మాట్లాడుతూ... మీడియాపై ఎంపీ అవినాశ్ అనుచరులు గూండాయిజానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఒక బాధ్యతను నిర్వహిస్తూ... నిజాలను ప్రజలకు చేరే వేస్తున్న మీడియా ప్రతినిధిపై నిస్సిగ్గుగా దాడి చేయడమే కాకుండా వాహనాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఏ ధైర్యంతో ఇలాంటి దాడులకు పాల్పడ్డారో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న వారికి తలొగ్గకుండా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నిజనిజాలను ప్రజలకు చేరవేస్తోందని తెలిపారు. అది సహించని వైసీపీ రౌడీమూక ఈ దారుణానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశంసలు కాకుండా..!

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ముందే చాలా విషయాలు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయ్యాయని.. దీంతో నిజాన్ని ఆపలేకపోయామనే ఫస్ట్రేషన్‌లో ఏబీఎన్ ప్రతినిధిపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం మొత్తంలో మీడియా పరిస్థితి చాలా దారుణంగా ఉందని... ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకంటే మీడియా పరిస్థితి దారుణంగా పడిపోయిందని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయన్నారు. ఏపీలో అయితే మీడియా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. హత్య కేసులో విషయాలను బయటపెడుతున్న మీడియాను ప్రశంసించాల్సింది పోయి.. కవరేజ్‌కు వెళ్లిన వారిపై దాడి చేయడం అమానుషమన్నారు రేవతి.

కర్త, కర్మ, క్రియ జగనే..!

గౌరవనీయ పదవిలో ఉన్న సీఎం జగన్ (CM Jaganmohan Reddy).. ప్రతీసారి మీడియా ప్రతినిధులు, సంస్థలను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారని తెలిపారు. అక్కడి నుంచే మీడియాపై అరాచకం మొదలైందన్నారు. ఈరోజు మీడియా ప్రతినిధిపై దాడికి సీఎం జగనే కారణమని ఆరోపించారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకునేలా ప్రతీ జర్నలిస్టు నిరసన తెలపాలన్నారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ ఘటనపై క్షమాపణలు చెబుతూ... న్యాయం జరిగేలా చూస్తానని ఓ ప్రకటనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాడిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని... ఆలస్యం చేయడం వల్ల మరొకరికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రతీ జర్నలిస్ట్ దీన్ని ఖండిస్తూ... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రేవతి డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-19T14:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising