BJP MlAs: ప్రోటెం స్పీకర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన
ABN, First Publish Date - 2023-12-09T14:53:13+05:30
Telangana: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. శనివారం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. శనివారం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేట్ 2 వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు వారించారు. సభలో ఎంతో మంది సీనియర్లు ఉన్న అక్బర్‌ను పెట్టడం ఏంటని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.
కాగా.. ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామకాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీ సమావేశాలను బహష్కిరించిన విషయం తెలిసిందే. అలాగే.. గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రెటరీని ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ నియమాకంపై గవర్నర్ సెక్రెటరీకి కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సీనియర్‌ను కాకుండా ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమించటాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రోటైం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉండటంతో ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎంఐఎం రజాకార్ల పార్టీ అని తెలంగాణలో రజాకారులు చేసిన ఆకృత్యాలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గుర్తుచేస్తున్నారు.
Updated Date - 2023-12-09T14:53:14+05:30 IST