TS NEWS: పాతబస్తీలో ఎంఐఎం ఆఫీస్‌కు నిప్పటించిన గుర్తు తెలియని వ్యక్తి
ABN, First Publish Date - 2023-12-05T16:17:27+05:30
పాతబస్తీలో ఎంఐఎం కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్‌లోని హాశమబాద్ ఎంఐఎం కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: పాతబస్తీలో ఆల్ ఇండియా ముజ్లిస్ ఏ ఇత్తెహదుల్ ముస్లిమిన్ (ఏఐఎంఐఎం) కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్‌లోని హాశమాబాద్ ఎంఐఎం కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బాటిల్లో పెట్రోల్‌ని తీసుకొచ్చి ఆఫీస్ డోర్‌పై పోశాడు. అనంతరం అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఆఫీస్ కార్యాలయంలో ముందుభాగంలో ఉన్నా డోర్ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనపై ఎంఐఎం కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆఫీస్ వద్దకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-12-05T17:21:32+05:30 IST