ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Preeti: మెడికో ప్రీతి కేసులో మరో ట్విస్ట్

ABN, First Publish Date - 2023-02-27T15:08:10+05:30

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసు (Medico Preeti Case)లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ప్రీతిది ఆత్మహత్యా లేక హత్యనా అనే అనుమానాలపై విచారణ చేయాలని ఓయూ జేఏసీ (OU JAC) కోరింది. ఈ విషయంపై హెచ్‌‌ఆర్‌సీ (HRC)ని ఓయూ జేఏసీ ఆశ్రయించింది. మెడికో విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని సోమవారం హెచ్‌‌ఆర్సీలో ఓయూ జేఏసీ పిటిషన్ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్ల (Junior Doctors) తో పోస్టుమార్టం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొంది. నిమ్స్, గాంధీ ఆస్పత్రి (NIMS, Gandhi Hospitals)లో పోలీసులు (Telangana Police) వ్యవహరించిన తీరుపై విచారణ చేయాలని హెచ్‌ఆర్‌సీని ఓయూ జేఏసీ కోరింది.

ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ మాట్లాడుతూ... మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై మానవ హక్కుల కమిషన్‌ (Human Rights Commission)ను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రీతి కుటుంబాన్ని డీసీపీ జోయల్ డెవిస్ (DCP Joel Davis) తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు. గాంధీ (Gandhi Hospital)లో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను అనుమతించలేదని తెలిపారు. ప్రీతి మృతదేహానికి సీనియర్ డాక్టర్స్ చేత పోస్టుమార్టం చేయించలేదన్నారు. జూనియర్ డాక్టర్స్ చేత పోస్టుమార్టం చేయించారని మండిపడ్డారు. ఒక ఉగ్రవాదుల మాదిరిగా పోలీసులు వ్యవహారించారని అన్నారు. ప్రీతిని తరలిస్తున్న అంబులెన్స్‌లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్‌లో తన నివాసంలో ఆపాలని కుటుంబ సభ్యులు కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రీతి మృతిఫై సిట్టింగ్ జడ్జ్ (Sitting Judge) చేత విచారణ జరిపించాలని సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-27T15:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising