bandi bhagiratha: పోలీసుల నోటీస్కు బండి సంజయ్ కుమారుడు రిప్లై
ABN, First Publish Date - 2023-01-27T18:00:40+05:30
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కుమారుడు (Bandi Sanjay Kumar) భగీరథకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కుమారుడు (Bandi Sanjay Kumar) భగీరథకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. తోటి విద్యార్థిపై దాడి కేసులో దుండిగల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల బండి భగీరథ (bandi bhagiratha)పై దుండిగల్ పోలీసులు (POLICE CASE) కేసు నమోదు చేశారు. 41 కింద భగీరథకు నోటీసులు జారీ చేసినట్లు దుండిగల్ పోలీసులు తెలిపారు. పోలీసులు ఎప్పుడు విచారణకు రమ్మన్నా హాజరవుతానని, పోలీసుల నోటీసులకు భగీరథ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి భగీరథ పోలీసుల ఎదుట హాజరయ్యారు. తన వద్ద ఉన్న వివరాలన్నీ భగీరథ పోలీసులకు ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా అవసరమయితే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారు.
మహీంద్రా యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్ అనే విద్యార్థిపై బండి భగీరథ దాడి చేశాడని వర్సిటీ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ క్యాంపస్ ప్రాంగణంలోనే ఈ దాడి జరిగిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరిగినట్లు వర్సిటీ క్రమశిక్షణా సంఘం వెల్లడించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దుండిగల్ పోలీసులు భగీరథపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీరామ్ అనే విద్యార్థిపై భగీరథ దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహీంద్రా యూనివర్సిటీలో బండి సంజయ్ కుమార్ తనయుడు బండి భగీరథ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నారు.
Updated Date - 2023-01-27T18:02:13+05:30 IST