Bandi Sanjay: అందుకే ఇందిరాగాంధీ ‘‘గరీబీ హఠావో’’ నినాదాన్ని అమలు చేస్తున్నాం
ABN, First Publish Date - 2023-05-29T13:05:38+05:30
ఇందిరాగాంధీ ‘‘గరీబీ హఠావో’’ నినాదాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్: ఇందిరాగాంధీ ‘‘గరీబీ హఠావో’’ నినాదాన్ని మోదీ ప్రభుత్వం (Modi Government) అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తొమ్మిదేళ్ల పాలన, విజయాలపై సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... టాయిలెట్ల నిర్మాణం, రేషన్, ఇండ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవని..అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. అందుకే డీబీటీ విధానంతో అవినీతికి తావులేకుండా లబ్దిదారుడికి మోదీ ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్’’ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నామని ఆయన చెప్పారు.
ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత అభివృద్ధే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. గత పాలనలోని మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత మోదీదే అని చెప్పుకొచ్చారు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ‘‘గరీబీ హఠావో’’ నినాదం మంచిదే అని.. ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని... మంచి ఉద్దేశంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం అందజేత సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర పథకాల విషయంలో రూపాయి పేద వాడికి పంపిస్తే.. 15 పైసలే అందుతున్నాయని రాజీవ్ గాంధీ చెప్పారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని డీబీటీ విధానంతో లబ్దిదారుడికి మోదీ నేరుగా ప్రయోజనం చేకూరుస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-05-29T13:05:43+05:30 IST