ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్..

ABN, First Publish Date - 2023-02-14T15:14:53+05:30

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) పార్టీ గ్రౌండ్‌లో లేదని.. అధికారంలోకి రాలేమనీ కాంగ్రెస్ నేతలు (Congress Leaders) అంటున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నార

ని, ఆ పార్టీలో గెలిచిన వారు బీఆర్ఎస్‌ (BRS)లోకి వెళ్ళారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గెలిచిన తర్వాత బీఆర్ఎస్‌కు వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారన్నారు.

బీజేపీ అధికారంలోకి రాదంటే.. మరి సీఎం కేసీఆర్ (CM KCR) బీజేపీ (BJP)ని ఎందుకు తిడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని అన్నారు. వాళ్ళందరూ దండుపాళ్యం బ్యాచ్.. అంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు వయసు పెరిగింది... అందుకే ఇంకా ఈటల రాజేందర్ (Etala Rajender) వాళ్ళ పార్టీలో ఉన్నారని అనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ ఈసారి తెలంగాణ (Telangana)లో హంగ్ అసెంబ్లీ (Hung Assembly) వస్తుందని జోస్యం చెప్పారు. తమతో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ను పొగుడుతూ.. బీజేపీ (BJP)ని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో మేము చెప్పామని, దేశానికి చాలా చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంచి పార్టీ అని, తెలంగాణ ఇచ్చిందని.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-14T15:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising