ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DK Aruna: ‘డాక్టర్ ప్రీతి కేసుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?’

ABN, First Publish Date - 2023-03-06T15:33:23+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) కు మహిళలంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (BJP National Vice President DK Aruna) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తన గొప్పతనాన్ని చాటుకునేందుకే దిశా కేసు (Disha case) లో ఎన్‌కౌంటర్ చేయించారన్నారు. కేఎంసీ ఆసుపత్రి (KMC Hospital)లో సీసీ కెమెరాలు పనిచేయలేదంటే నేరాన్ని తప్పించుకునేందుకే పగడ్భందీగా ప్లాన్ చేసారని అర్థమవుతుందని తెలిపారు. ఆడపిల్లలను చదువు కోసం హాస్టల్స్‌కు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. మరోసారి అధికారంలోకి రావాలని ఆలోచన తప్పితే మహిళలపై జరుగుతున్న దారుణాలపై కేసీఆర్‌ (Telangana CM) కు ఆలోచన లేదని బీజేపీ నేత మండిపడ్డారు.

కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రీతి హత్య కేసు (Doctor Preeti Case)లో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రీతీ కేసు (Preeti Case)ను ప్రభుత్వం (Telangana Government) నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తే బీజేపీ (BJP) చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపడానికి ముఖ్యమంత్రిగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కేసీఆర్ (BRS Chief) స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై పూర్తి నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని డీకే అరుణ (BJP Leader) పేర్కొన్నారు.

Updated Date - 2023-03-06T15:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising