ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Aruna: తెలంగాణలో విప్లవం మొదలైంది.. నీ పతనం తథ్యం కేసీఆర్

ABN, First Publish Date - 2023-09-13T14:05:47+05:30

తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ (CM KCR) ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారని బీజేపీ నేత డీకే అరుణ (BJP Leader DK Aruna) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలి తీసుకున్నారని ఆరోపించారు. 12 వందల మంది ఉసురుపోసుకొని గద్దెనెక్కిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులుగానే ఉంచారన్నారు. నిరుద్యోగ ఆశలను కేసీఆర్ నెరవేర్చలేదని.. ఇప్పటి వరకు డీఎస్సీ వేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని..ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం హస్తం ఉన్నట్లే అని బీజేపీ నేత ఆరోపించారు.


కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు అనేక ప్రకటనలు ఇస్తు మరోసారి మోసం చేశారన్నారు. ప్రకటనల పేరుతో పాలాభిషేకాలు చేయించుకోవడానికి కేసీఆర్‌కు సిగ్గు ఉండాలన్నారు. తెలంగాణ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తావు కేసీఆర్ అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడికి పోయాయి కేసీఆర్ అని నిలదీశారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చేప్పెందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిగ్గు లేదా అంటూ విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణలో విప్లవం మొదలైంది కేసీఆర్.. నీ పతనం తథ్యం’’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో మార్పు జరగాలని.. అది బీజేపీతోనే సాధ్యమని డీకే అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-13T14:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising