ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayashanti: కేసీఆర్ సర్కారు హయాంలో మహిళా దినోత్సవం ఒక్కటే తక్కువ... రాములమ్మ విమర్శలు

ABN, First Publish Date - 2023-06-13T14:36:32+05:30

బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై (CM KCR) బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం పట్ల రాములమ్మ తనదైన రీతిలో స్పందించారు. అసలు మహిళల పేరిట వేడుక చేసే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా అంటూ విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా రాములమ్మ విమర్శనాస్త్రాలు సంధించారు.

‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరం అయితుందన్నట్టు కేసీఆర్ సర్కారు ఆర్భాటంగా దశాబ్ది సంబురాలు చేస్తోంది. 21 రోజుల పాటు రకరకాల పేర్లతో వేడుకలు జరుపుతోంది. ఇందులో భాగంగా నేడు మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. నిజం చెప్పాలంటే మహిళల పేరిట వేడుక చేసే అర్హత బీఆరెస్ సర్కారుకి ఏ మాత్రం లేదు. 2014లో మొదటి విడత కేసీఆర్ సర్కారు ఏర్పడినప్పుడు మంత్రివర్గంలో ఒక్క మహిళకి కూడా చోటు దక్కలేదు. 2019లో రెండో విడత సర్కారు ఏర్పాటయ్యాక విమర్శల్ని తట్టుకోలేక మంత్రివర్గంలో మహిళలకి చోటిచ్చారు. ఇక రాష్ట్రంలో మహిళలను కాపాడేందుకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామని పదే పదే గొప్పగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్... తమ పార్టీలోని మహిళలని కూడా వేధింపుల నుంచి కాపాడలేని దుస్థితిలో ఉన్నారు. స్వంత పార్టీ ఎమ్మెల్యే చేతిలో చేదు అనుభవానికి గురైన ఒక మహిళా సర్పంచి ఉదంతం.. నిన్నగాక మొన్న మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఢిల్లీలోని తెలంగాణ‌భవన్ వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఒక ప్రైయివేట్ సంస్థ ఉద్యోగిని వేదన... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవిగాక రాష్ట్రంలో చాలా బడులు, చివరికి కాలేజి స్థాయిలో కూడా సరైన టాయిలెట్స్ లేక విద్యార్థినుల మర్యాదను కాపాడే పరిస్థితులు కల్పించలేని దుస్థితిలో బీఆర్‌ఎస్ సర్కారు ఉంది. రాజధాని హైదరాబాద్ నగరంలో 700 మంది విద్యార్థినులున్న సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో టాయిలెట్స్ లేక విద్యార్థినిలు బాధలు పడుతున్న విషయం కోర్టు వరకూ వెళ్లిందంటే రాష్ట్రంలో మహిళా సంక్షేమం ఎంత గొప్పగా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఇక దొర ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని సంవత్సరాల్లోనే శృతి ఎన్‌కౌంటర్ లాంటి వరంగల్ ఆడబిడ్డపై కేసీఆర్ సర్కారు చేసిన దురాగతం జనం యాది మర్వలే... ఇంత గొప్ప సర్కారు హయాంలో మహిళా దినోత్సవం ఒక్కటే తక్కువ’’ అంటూ విజయశాంతి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-13T14:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising