BJP: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ... గవర్నర్‌తో బీజేపీ నేతల భేటీ
ABN, First Publish Date - 2023-03-18T10:43:33+05:30
గవర్నర్ తమిళిసైతో బీజేపీ నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు.
హైదారాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) తో బీజేపీ నేతలు (BJP Leaders) శనివారం ఉదయం భేటీ అయ్యారు. డీకే అరుణ (DK Aruna) , ఈటల (Etela Rajender), రామచంద్రరావు (Ramachandrarao), ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి (MLC AVN Reddy) తదితరులు గవర్నర్‌ను కలిశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని నేతలను గవర్నర్‌ను కోరనున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కమలం పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతో పాటు.. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
కాగా.. నిన్న గన్‌పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) మెరుపు ధర్నా ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leakage) ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు(CM KCR) వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గన్‌పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని నిరసన దీక్ష చేస్తోన్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో బీజేపీ కార్యకర్తలు పోలీస్ గోబ్యాక్(Police go back) అంటూ బీజేపీ క్యాడర్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తోంది. ఇదే క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Updated Date - 2023-03-18T12:39:17+05:30 IST