ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP MLAs: గవర్నర్ సెక్రటరీని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2023-12-09T13:36:22+05:30

Telangana: గవర్నర్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సెక్రెటరీని ఎమ్మెల్యేలు కలిశారు.

హైదరాబాద్: గవర్నర్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌తో (Governor Secretary Surendra Mohan) బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs)భేటీ అయ్యారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సెక్రెటరీని ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ నియమాకంపై గవర్నర్ సెక్రెటరీకి కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సీనియర్‌ను కాకుండా ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమించటాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రోటైం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉండటంతో ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎంఐఎం రజాకార్ల పార్టీ అని తెలంగాణలో రజాకారులు చేసిన ఆకృత్యాలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గుర్తుచేస్తున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్‌ను కలిశామని.. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్‌గా స్పీకర్గా నియమించడంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కంటే ఆరుగురు సీనియర్ సభ్యులు ఉన్నప్పటికీ ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థులు ఓవైసీనే ప్రొటైం స్పీకర్‌గా ఎందుకు నియమించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఒక్కటే అని అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటైం స్పీకర్‌గా నియమించడంపై అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేయనున్నట్లు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-12-09T14:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising