ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lakshman: సంస్థాగత బలోపేతంలో భాగంగానే పార్టీ అధ్యక్ష మార్పు..

ABN, First Publish Date - 2023-07-30T13:39:15+05:30

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసామని, వర్షాలతో తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పామని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిసామని, వర్షాలతో తెలంగాణ రైతులు (Telangana Farmers) ఇబ్బందులు పడుతున్నారని చెప్పామని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Lakshman) తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం పరిశీలన బృందాన్ని పంపిస్తుందని, నష్టంపై నివేదిక రాగానే కేంద్రం తరపున సహాయం అందిస్తామని చెప్పారు. ‘రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి పిడెలు వాయించినట్లు’ సీఎం కేసిఆర్ (CM KCR) వ్యవహారిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల కోసం రోడ్ మ్యాప్‌పై అమిత్ షాతో చర్చలు జరిపామన్నారు. సంస్థాగత బలోపేతంలో భాగంగానే పార్టీ అధ్యక్ష మార్పు జరిగిందని, బండి సంజయ్‌ (Bandi Sanjay)కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ వచ్చిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి బండి సంజయ్‌కి మాత్రమే చోటు దక్కిందన్నారు.

ఒక్కరు పార్టీ నుంచి వెళ్తే నలుగురు బీజేపీలో చేరుతున్నారని, కేసిఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలనకు చరమగీతం పాడుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఒక్క కుటుంబ నుంచి అరుగురికి పదవులు ఇవ్వడం రాచరికానికి నిదర్శనమన్నారు. 1600 మంది రక్తపు కూడు కాంగ్రెస్ (Congress) తింటుందని, తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది మేమే అంటూ కాంగ్రెస్ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 1600 మంది ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణామనే అంశం తెలంగాణ ప్రజలు మరువలేదన్నారు. కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు విశ్వాసం లేదని, ఢిల్లోలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ తోక పార్టీల వ్యవహారిస్తుందని ఆరోపించారు. ప్రజాధనాన్ని వృధా చేయడమే లక్ష్యంగా విపక్షాలు పార్లమెంట్‌లో పనిచేస్తున్నాయని, మణిపూర్ అంశంపై చర్చకు సిద్దామని ప్రభుత్వం ప్రకటించిన విపక్షాలు చర్చకు సహకరించడం లేదని మండిపడ్డారు. మణిపూర్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులపై చర్చ జరపాలని.. అప్పుడే పార్టీల అసలు రంగు బయటపడుతుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.ా

Updated Date - 2023-07-30T13:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising