MP Laxman: బీఆర్ఎస్, ఆమ్‌ఆద్మీ పార్టీలది మద్యం బంధం
ABN, First Publish Date - 2023-08-08T15:53:57+05:30
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ (Delhi Ordinance) తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS), ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)ల మధ్య మద్యం బంధం ఉందని, కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. ఆస్తులు, ఇతర అంశాలను తారుమారు చేయడానికి మాత్రమే ఆప్ పార్టీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తోందని, అవినీతి, కుంభకోణాలకు అడ్రస్ గల పార్టీ అని.. అలాంటి అవినీతి పార్టీకి బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారంటే తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు.
అవినీతి పార్టీలకు చెక్ పెట్టేందుకు ఒక ఉద్యమం చేపట్టబోతున్నామని లక్ష్మణ్ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను రాజకీయంగా పుట్టగతులు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. మరోసారి అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారని, ఇండియా కూటమిలోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలను చూడలేక ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయని దుయ్యబట్టారు. చర్చకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటే సభ నుండి పారిపోతున్నారని, అమిత్ షా కూడా మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్తుంటే అవిశ్వాసం పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Updated Date - 2023-08-08T15:53:57+05:30 IST