Bandi Sanjay: కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే..!
ABN, First Publish Date - 2023-06-23T17:23:01+05:30
మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. రాజకీయ పార్టీలు వేరు.. ప్రభుత్వం వేరని బీజేపీ అధ్యక్షుడు తేల్చిచెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరెళ్లినా కేంద్ర పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తారని తెలిపారు. కేటీఆర్.. కేంద్ర పెద్దలను కలవడం సాధారణ విషయమేనని
హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు (KTR) కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. రాజకీయ పార్టీలు వేరు.. ప్రభుత్వం వేరని బీజేపీ అధ్యక్షుడు తేల్చిచెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరెళ్లినా కేంద్ర పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తారని తెలిపారు. కేటీఆర్.. కేంద్ర పెద్దలను కలవడం సాధారణ విషయమేనని పేర్కొన్నారు. దీనికి రాజకీయ రంగు పులమొద్దు అని చెప్పారు. బీజేపీ కార్యకర్తలను చంపించిన మమతా బెనర్జీకి కూడా కేంద్ర పెద్దలు సమయం ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించటం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ బెదిరింపులకు దిగిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి బండి కౌంటర్
‘‘ప్రజల మానసిక పరిస్థితి ఏంటో.. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి అర్థమైంది. డిపాజిట్లు రానివారే మానసిన పరిస్థితిపై చర్చిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన అలోచనలు, జాతీయవాదం మాకు స్ఫూర్తి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకంటే బెంగాల్.. బంగ్లాదేశ్‌లో, కాశ్మీర్.. పాకిస్థాన్‌లో కలిసేవి. దేశ విభజనను వ్యతిరేకించిన నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ.’’ అని బండి సంజయ్ కొనియాడారు.
Updated Date - 2023-06-23T17:23:01+05:30 IST