Vivekananda Goud: మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీగా మారిపోయింది
ABN, First Publish Date - 2023-06-13T15:31:47+05:30
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌పై
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ (MLA Vivekananda Goud) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీగా మారిందన్నారు. ధరణితో ఇప్పటివరకు 27 లక్షల లావాదేవీలు జరిగాయాని వెల్లడించారు. నిషేధిత జాబితాలోని 50 వేల సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పుకొచ్చారు. భూదాన్ భూముల్లో అక్రమాలు జరిగితే కోర్టులు తేలుస్తాయని తెలిపారు. తిమ్మాపూర్‌కు వెళితే రేవంత్ రెడ్డిని కొడతారన్నారు. రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రేవంత్‌లా అందరూ జైలుకు వెళ్లాలనుకోవడం సరికాదని హితవు పలికారు.
Updated Date - 2023-06-13T15:31:47+05:30 IST