KCR: బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్
ABN, First Publish Date - 2023-02-12T17:43:22+05:30
తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)కు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)కు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కౌంటర్ ఇచ్చారు. కూలుస్తామంటే ఎవరు ఊరుకుంటారు?, కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా?, కాళ్లు.. రెక్కలు విరిచి పడుకోబెడతారని కేసీఆర్ హెచ్చరించారు. అలా మాట్లాడేవారిని ప్రజలే చూసుకుంటారని కేసీఆర్ హెచ్చరించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టానని, పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించామని కేసీఆర్ అన్నారు. కొత్త సచివాలయం, ప్రగతిభవన్‌పై విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో 361 బిలియన్ టన్నుల కోల్ నిల్వలున్నాయని, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఎందుకు దిగుమతి చేసుకోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. దమ్మున్న ప్రధాని ఉంటే కరెంట్ ఎందుకు రాదు? అని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరంతర విద్యుత్ ఇస్తున్నారా? అని కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటూ ఎవరో ధర్నా చేశారని, గ్రిడ్ లోడ్ బ్యాలెన్స్ లేకుంటే కరెంట్ కట్ చేస్తారని, నిమిషం కూడా కరెంట్ పోదు.. పోనివ్వమని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంత ఖర్చు అయినా సరే కరెంట్ పోనివ్వనని కేసీఆర్ స్పష్టం చేశారు. 16 వేల మెగావాట్ల లోడ్‌కు చేరినా కరెంట్ పోదని కేసీఆర్ పేర్కొన్నారు.
అభివృద్ధిపై మాట్లాడే హక్కు మోదీకి లేదని, దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయే అని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్.. మోదీ హయాంలో సైలెన్స్ రాజ్ అని, రూ.20 లక్షలు కోట్లు ఎంఐఎంఈ (MIME)లకు ఇచ్చామన్నారని,.. ఎవరికి ఇచ్చారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్డీఏ (NDA) అంటే నో డాటా అవైలబుల్ అని చిదంబరం అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి మోదీ ఫోటో కోసం రేషన్ డీలర్‌తో కొట్లాడతారా?, ఏం సాధించారని మోదీ ఫోటో పెట్టుకోవాలని కేసీఆర్ అసెంబ్లీలో నిలదీశారు. దేశంలో మోదీ తెచ్చిన ఏ పాలసీ అయినా సక్సెస్ అయ్యిందా?, నోట్ల రద్దు సక్సెస్ అయ్యిందా?, ఇప్పుడు మనీ సర్క్యూలేషన్ పెరిగిందని, కేంద్రం దగ్గర దేనికీ లెక్కలుండవని, ఎన్‌పీఏ (NPA)ల పేరుతో లక్షల కోట్లు మాఫీ చేశారని కేసీఆర్ మండిడ్డారు.
Updated Date - 2023-02-12T17:45:03+05:30 IST