CM Revanth Reddy : ఉద్యోగ నియామకాలపై దూకుడు పెంచిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-12-11T21:39:20+05:30
ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) దూకుడు పెంచారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా టీఎస్పీఎస్సీ (TSPSC) అడుగులు వేయనున్నది.ఇప్పటికే కోదండరామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) దూకుడు పెంచారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా టీఎస్పీఎస్సీ (TSPSC) అడుగులు వేయనున్నది.ఇప్పటికే కోదండరామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ చేయనుంది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ (TSPSC) చైర్మన్, సెక్రెటరీలతో సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెక్రెటరియేట్‌కి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, బోర్డు సభ్యులు, ఎస్పీడీసీఎల్ (SPDCL) సీఎండీ రఘుమారెడ్డి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు టీఎస్పీఎస్సీతో పాటు విద్యుత్‌పైన సీఎం రివ్యూ చేశారు
Updated Date - 2023-12-11T21:39:21+05:30 IST