CM Revanth Reddy: గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ABN, Publish Date - Dec 23 , 2023 | 05:22 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్ల (Gig workers) సమస్యలపై చర్చించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ( Nampally Exhibition Ground ) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కాసేపటి క్రితమే వచ్చారు.
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్ల (Gig workers) సమస్యలపై చర్చించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ( Nampally Exhibition Ground ) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కాసేపటి క్రితమే వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు (ఆన్‌లైన్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తాత్కాలికంగా పని చేస్తున్నారు.) ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ గిగ్ వర్కర్లతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో గిగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్‌కు ఈ సందర్భంగా గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గిగ్ వర్కర్స్‌తో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిగ్ వర్కర్లను ఆదుకుంటామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని కలిసి సమస్యలసై చర్చించారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 06:15 PM