Congress: కోమటిరెడ్డిని సస్పెండ్ చేయండి.. మాణిక్‌రావుకు చెరుకు సుధాకర్ ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-03-11T13:21:37+05:30
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్‌రావ్ థాక్రేకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)పై కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్‌రావ్ థాక్రే (Congress Incharge Manikrao Thakre)కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ (Congress Vice President Cheruku Sudhakar) ఫిర్యాదు చేశారు. తనని చంపుతానంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. అనంతరం చెరుకు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించారని తెలిపారు. తన కొడుకుకు ఫోన్ చేసి బూతుపదాలతో దూషించి చంపుతామని బెదిరించారన్నారు. ‘‘మాణిక్‌రావు ఠాక్రేకు ఫిర్యాదు చేశాను. ఈ అంశం ఏఐసీసీ పరిధిలోకి వెళ్లింది కనుక ఇక ఏమీ మాట్లాడను. పార్టీకి నష్టం చేసే చర్యలు చేయను. క్షమాపణలు చెప్పాలని కూడా అడగను. ఆయన వల్ల మునుగోడులో పార్టీకి నష్టం జరిగినా, పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నేను అడగలేదు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీని కోరాం. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుంది. కోమటిరెడ్డికి బెదిరింపు ఫోన్లు ఎవరు చేస్తున్నారో తెల్వదు. నల్లగొండలో మేము ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు లేవు. సోషల్ మీడియాలో ఎవరో ఏదో కామెంట్స్ చేశారని కార్యకర్తలను రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టారు. కోమటిరెడ్డికి బెదిరింపు కాల్స్ చేసేవాళ్ళపై చర్యలు తీసుకోవాలి’’ అంటూ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-03-11T13:26:30+05:30 IST