Mallu Ravi: కార్ల్‌మార్క్స్ తరహాలో సామాజిక న్యాయానికి గద్దర్ కృషి
ABN, First Publish Date - 2023-08-08T16:01:48+05:30
కార్ల్‌మార్క్స్(Karl Marx0 ఎలాగైతే సమాజం కోసం పని చేసి మార్గదర్శకం అయ్యారో.. గద్దర్(Gaddar) ఆలోచన విధానం కూడా అదేనని.. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) అన్నారు.
హైదరాబాద్(Hyderabad): కార్ల్‌మార్క్స్(Karl Marx0 ఎలాగైతే సమాజం కోసం పని చేసి మార్గదర్శకం అయ్యారో.. గద్దర్(Gaddar) ఆలోచన విధానం కూడా అదేనని.. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) అన్నారు. మంగళవారం గాంధీభవన్(Gandhi Bhavan)లో కాంగ్రెస్ నాయకులు(Congress leaders), టీపీసీసీ అధికార ప్రతినిధులు గద్దర్‌కు నివాళి(Tribute to Gaddar) అర్పించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు, సమాజంలో మార్పు కోసం అన్నివర్గాల కోసం ఆయన పాటలు రాశారు.తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆట, పాట, మాట ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో(Rahul Gandhi is Bharat Jodo) యాత్రలో పాల్గొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నారు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలల్లో కూడా గద్దర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే సభల్లో కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు.కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని భావించిన గద్దర్ కాంగ్రెస్ నేతల సభలకు సంఘీభావం ప్రకటించారు. గద్దర్ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి కాంగ్రెస్ తరపున సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, గద్దర్ మరణ వార్త తెలియగానే ఆ రోజు నుంచి అంత్యక్రియలు అయ్యే వరకు అన్ని తనై పని చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు.
Updated Date - 2023-08-08T16:01:58+05:30 IST