Corporator Geeta Praveen: ‘అర్ధరాత్రి వరకు ట్వీట్ చేస్తూ ఆమెను ఇబ్బందిపెడతావా’..!
ABN, First Publish Date - 2023-02-26T13:34:06+05:30
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ(ఆర్‌జీవీ) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు తీవ్రంగా ఖండించారు.
ఉప్పల్ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ(ఆర్‌జీవీ) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు తీవ్రంగా ఖండించారు. శనివారం ఉప్పల్ ప్రెస్‌క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంబర్‌పేటలో కుక్కల దాడి ఘటనలో బాలుడి మృతికి మేయర్ విజయలక్ష్మి ఒక్కరే కారణమన్నట్టు, మహిళ అని కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు ట్వీట్ చేస్తూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు.
ఇలాంటి సంఘటలపై నేరుగా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చి మేయర్‌కు, కమిషనర్‌కు మంచి సూచనలు చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తే ఎవరూ ఊరుకోరు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాంగోపాల్‌వర్మ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎదుల్ల కొండల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, కొకొండ జగన్, కొప్పు నర్సింగరావు, మనీష్, ఆలె రమేష్ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-26T13:36:18+05:30 IST