ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CV Anand: ముగింపు దశకు గణేష్ నిమజ్జన ఘట్టం

ABN, First Publish Date - 2023-09-29T15:34:48+05:30

గణేష్ నిమజ్జన ఘట్టం ముగింపు దశకు చేరుకుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఘట్టం ముగింపు దశకు చేరుకుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు పోలీసు కమిషనరేట్‌లో సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో పని చేసిన పోలీస్ సిబ్బంది అందరికి ధన్యవాదాలు. నగర్ ప్రజలను నిమజ్జనికి సహరించారు..ఈసారి భారీగా విగ్రహలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయింది. ‘‘మిలాద్ ఉన్ నబీ’’ పండుగా ఉండటంతో ర్యాలీని ముస్లిం మత పెద్దలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన ‘‘మిలాద్ ఉన్ నబీ’’ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నాం. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేష్‌ను ముందుగా నిమజ్జనం చేశాం. ఈరోజు కూడా ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కోసం కనిపిస్తున్నాయి. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజాలో విగ్రహలు ఉన్నాయి. 450 విగ్రహాలు నిమజ్జనానికి మిగిలి ఉన్నాయి. జియో టాకింగ్ లెక్కల ప్రకారం.. నిన్న ఈరోజు 10,020 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఐదు ఫీట్ల నుంచి మిగిలినవి సంబంధించిన విగ్రహాలు ఈరోజు నిమజ్జనం అవుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది 10 నుండి 15% ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారు.

రెండు విషాదకరమైన ఘటనలు జరిగాయి. బషిర్‌బాగ్, సంజీవయ్యపార్క్, సికింద్రాబాద్‌లో మొత్తం 5 మంది చనిపోయారు. 48గంటలుగా పోలీసు సిబ్బంది అందరూ కష్టపడి పని చేస్తున్నారు. ఈరోజు హుస్సేన్‌సాగర్, ప్రసాద్ ఐ మ్యాక్స్ ప్రాంతాల్లో నార్మల్ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. మిగిలిన విగ్రహాల నిమజ్జనానికిః ఇంకా 5గంటల సమయం పడుతుంది. పోలీస్ ఆఫీసర్లు విజ్ఞప్తి చేసిన కొంతమంది మండప నిర్వాహకులు కావాలనే ఆలస్యంగా విగ్రహాలను తీసుకువచ్చారు. నిమజ్జనంలో మండప నిర్వాహకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది..ప్రజలను ఇబ్బందులను గురి చేయొద్దు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జన కార్యక్రమంలో భాగంగా 250కి పైగా కేసులు షి టీమ్స్ పోకిరీలపై కేసులు నమోదు చేశారు. చాలాచోట్ల న్యూసెన్స్ జరిగిన ప్రజలకు ఇబ్బంది కలగవద్దని పోలీసులు సమన్వయంతో డ్యూటీ చేశారు’’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-29T15:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising