ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DRUGS: సినీ పక్కీలో హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా.. బానిసలవుతున్న అమ్మాయిలు

ABN, First Publish Date - 2023-02-14T19:46:35+05:30

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను డ్రగ్‌ ఫ్రీ సిటీగా చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి రూపం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ (DRUGS) ను పోలీసులు ఎంత కట్టడి చేసిన ఆగడం లేదు.. సినీ పక్కీలో డ్రగ్స్‌ను (HYDERBAD) నగరానికి చేరవేర్చి అంగట్లో సరుకులాగా విక్రయిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలపై పోలీసులు (police) ఎంత నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతున్న డ్రగ్స్ సినీ పక్కీలో చేరిపోతుంది. డ్రగ్స్‌కి బానిసలైతే బయట పడటం కష్టమే అని తెలిసిన, మరో వైపు పోలీసులు వాయిస్తున్న ఇంత కూడా భయం లేకుండా పోతుంది ఈ కంత్రీగాళ్ళకి. ఈ మధ్య కాలంలో ఐటీలో పని చేసే అమ్మాయిలు డ్రగ్స్‌కి బానిసై, మత్తులో వారిపై లైంగిక దాడులు చేస్తున్న తమకి పట్టదని మత్తులో ఉకిపోతున్నారు. ఐటీ సెక్టార్‌లో ఇంతకాలం మత్తుగా ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

హైదరాబాద్‌‌: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను డ్రగ్‌ ఫ్రీ సిటీగా చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి రూపం...హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌..అదే హెచ్‌ న్యూ (H-NEW). డ్రగ్స్‌ మూలాలపై కన్నేసిన హెచ్‌ న్యూ టీమ్స్‌...గోవా , ముంబై , బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. గోవాలో కేంద్రంగా డ్రగ్స్‌ సప్లై చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ ఎడ్విన్‌‌ను.. దశాబ్దాలుగా గోవా పోలీసులు కూడా రీచ్‌ కాలేకపోయారు. కానీ..మన పోలీసులు ఎడ్విన్‌ను ఆధారాలతో సహా పట్టుకుని ...హైదరాబాద్‌కు షిఫ్ట్‌ చేసేశారు. మన పోలీసులు చేసిన దైర్యసాహసాలకు గోవా పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఎడ్విన్‌ సెల్‌ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న ప్రతీ ఒక్కరి డేటా సేకరించిన నార్కోటిక్‌ వింగ్‌ టీమ్స్‌...హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ తీసుకుంటున్న...డ్రగ్స్‌ అమ్ముతున్న వారి వివరాలు పట్టేశారు. హైదరాబాద్‌లోని సాగుతున్న ఈ మత్తుమందు బిజినెస్‌పై కన్నెర్ర జేసిన హెచ్‌న్యూ టీమ్స్‌...ఎడ్విన్‌కు సన్నిహితంగా ఉంటూ...దేశవ్యాప్తంగా వంద మంది డ్రగ్స్ పెడ్లర్లు లిస్ట్‌ను పోలీసుల చేతిలో ఉంది. గోవా తరహాలో నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ డ్రగ్ డెన్‌లకు వెళ్లి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాల ఆగడాలపై కళ్లెం వేస్తున్నారు.

తాజాగా ముంబై నుండి హైదరాబాద్‌కి డ్రగ్స్ సప్లై అవుతుందని గుర్తించిన తరువాత ఆపరేషన్ ముంబై పేరుతో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ అధికారులు సాహసోపేతంగా ఆపరేషన్ చేసి డ్రగ్స్ ముఠాలు ఆగడాలను ఆటకట్టించారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు మూడు డ్రగ్స్ ముఠాలు, రాచకొండ పోలీసులు మరో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందాకు చెక్కుపెట్టేందుకు పోలీసులు పక్క ప్రణాళికలు అమలు చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఐటీ అధికారి సనా ఖాన్ అనే 22 ఏళ్ల యువతి గత కొన్నేళ్లుగా డ్రగ్స్‌కి బానిస అయింది. అయితే తరచు ముంబైకి వెళ్లి డ్రగ్స్ సేవించేది. ఇక హైదరాబాద్‌లో ఆమె జాబ్ పోగొట్టుకోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశం తో డ్రగ్స్‌ సేవించడంతో పాటు డ్రగ్స్ ను సప్లై చేస్తూ వచ్చింది. దీంతో ఆ యువతిపై నిఘా పెట్టి విచారణ చేస్తే అసలు నిజం బట్టబయలైంది. సనా ఖాన్ ద్వారా లింక్ మొత్తం బయట పడటంతో ముంబై‌లో ఆపరేషన్ చేశారు నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు.

సనాఖాన్ ఒక గ్రాము మూడు వేలకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌కి డ్రగ్స్ తెచ్చి ఒక గ్రాము 7 వేలకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సనాఖాన్ లిస్టులో హైదరాబాద్‌కి చెందిన 40 మంది, ముంబైలో 70 మంది స్నేహితులకు అమ్మకాలు చేస్తుందని గుర్తించారు. ముంబైలో జతిన్ బాలచంద్ర భలేరా అనే వ్యక్తి ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. ముంబై మలాద్ ప్రాంతం నుంచి శంషఉద్దీన్ అనే వ్యక్తి ద్వారా ఈ డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. ముంబైలో ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్‌ను పోలీసులు రీచ్ కాలేక పోయారు. దీంతో త్వరలో కింగ్ పిన్‌ను పట్టుకుంటాం అంటున్నారు పోలీసులు. ఈ ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ముంబై‌లో నయా ట్రెండ్ నడుస్తుంది. అమ్మాయిలకు డ్రగ్స్ ఇవ్వడం అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారిపై లైంగిక దాడి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదటి గ్యాంగ్ నుంచి 204 గ్రాముల MDMA , ఫోర్ వీలర్‌ను సీజ్ చేశారు పోలీసులు. మెహర్జ కాజీ అనే వ్యక్తి ముంబై కేంద్రంగా డ్రగ్స్ నడిపిస్తున్నాడు. ఇతనిపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండో గ్యాంగ్ నుంచి 40 గ్రాముల MDMA సీజ్ చేశారు. మూడో గ్యాంగ్ డ్రగ్స్‌తో పాటు గంజాయి సప్లై చేస్తుంది. ముంబైకి చెందిన ఇద్దరు భార్య భర్తలు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ దందా చేస్తున్నారు. ఏపీ నుంచి ముంబైకి గంజాయ్‌ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన పక్క సమాచారంతో హైదరాబాద్ మీదుగా వెళుతున్న గంజాయి వాహనాన్ని గుర్తించారు. పోలీసులను చూడగానే భార్య భర్తలు ఇద్దరు పరారు అయ్యారు. వాహనంలో ఉన్న 110 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. దీంతో ముంబై కేంద్రంగా నడుస్తున్న మూడు గ్యాంగ్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు.

గతంలో ఎక్కువుగా కొకైన్ పట్టుబడేది అయితే కొకైన్‌పై అన్ని దర్యాప్తు సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో విదేశాల నుంచి వస్తున్నా కొకైన్‌ను కట్టడి చేశారు. ఇప్పుడు కొకైన్ కి బదులు MDMA అనే నిషేదిత డ్రగ్‌ను భారీగా సప్లై చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొకైన్‌తో పోలిస్తే MDMA ఎక్కువ రేట్ పలుకుతుంది. దీంతో MDMA సప్లై ఎక్కువ ముంబై కేంద్రంగా నడుస్తున్నట్లు గుర్తించి ముంబైఫై దృష్టి పెట్టారు. మొత్తం ఈ మూడు గ్యాంగ్‌లో 13 మంది ఉండగా తాజా ఏడుమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇకముంబై‌లో టోనీ గ్యాంగ్ పట్టుబడిన తరువాత నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ అధికారులు మరింత దృష్టి పెట్టినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముంబై‌లో గతంలో నాలుగు ఫ్యాక్టరీలలో 4 వేల కేజీల MDMA‌ను ముంబై పోలీసులు సీజ్ చేశారు. నార్కొటిన్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ఏర్పాటు ఆయిన తరువాత 104 కేసులు కేసులు నమోదు అయ్యాయి. అందులో 12 రకాల డ్రగ్స్ సీజ్ చేశారు. 6.3 కోట్లు విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నామని సీపీ తెలిపారు. ఈ 104 కేసుల్లో 202 డ్రగ్స్ పెడలర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సేవిస్తున్న 1076 మందిని గుర్తించారు పోలీసులు. 1076లో 350 రిహ్యాబిలేటేషన్ సెంటర్‌కి పంపించగా, అందులో 80 మెంబెర్స్‌కి టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిందన్నారు సీపీ సీవీ ఆనంద్. నిందితులు యొక్క ఆస్తులను వేలం వేయడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇక రాచకొండలో కూడా ఇంటర్ నేషనల్ డ్రగ్స్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశారు. మలేషియా నుంచి నిషేదిత డ్రగ్స్‌ను హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఆ ముడి పదార్థాన్ని ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఎస్ఓటీ పోలీసులు. ఈ ముఠా డ్రగ్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పూణెకు చెందిన షేక్ ఫరీద్ మహ్మద్, ఫైజాన్ లను అరెస్ట్ చేసి, ఇద్దరి నుంచి 50 లక్షలు విలువైన 500 గ్రాముల సూడోఎఫిడ్రిన్ సీజ్ చేసినట్లు గుర్తించారు. ఈ ముడి పదార్థాన్ని ఆస్టేలియాలో MDMA డ్రగ్ గా మార్చి సప్లై చేస్తున్నారని తెలిపారు. ఈ ముడి పదార్థానికి ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఈ డ్రగ్స్‌కి బాగా గిరాకీ ఉందన్నారు రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహన్. ఇతర వస్తువుల్లో ఈ డ్రగ్స్ పెట్టి అనుమానం రాకుండా విదేశాలకు కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నారు. ట్రాన్స్ ఫోర్ట్ చేసే వారితో పాటుడ్రగ్స్ పెడలర్లు, సేవించే వారిపై నిఘా ఉందన్నారు. కొరియర్ సంస్థల ప్రమేయం ఎంత వరకు ఉందో దర్యాప్తులో తేలుతుందని, గతంలో ఓ పేరుగాంచిన బట్టల కంపెనీకి చెందిన పార్శిల్‌ల్లో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ఆ ముఠాతో లింకులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-14T19:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising