Gaddar : ఎల్బీస్టేడియం నుంచి కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర..
ABN, First Publish Date - 2023-08-07T13:18:49+05:30
ఎల్బీస్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవ వందనం.. స్లో మార్చ్, డెత్ మార్చ్‌లతో గన్ పార్క్‌కు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీస్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.
హైదరాబాద్ : ఎల్బీస్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవ వందనం.. స్లో మార్చ్, డెత్ మార్చ్‌లతో గన్ పార్క్‌కు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీస్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.
అల్వాల్ ఇంటి వరకూ గద్దర్ అంతిమ యాత్ర కొనసాగనుంది. అనంతరం అల్వాల్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లి అక్కడి నుంచి మహాబోధి మహావిద్యాలయంలో ఆయన దహన సంస్కారం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. గన్ పార్క్, అసెంబ్లీ, అమరవీరుల స్మారక స్థూపం, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్, జేబీఎస్, అల్వాల్ మీదుగా గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు.
Updated Date - 2023-08-07T13:31:30+05:30 IST