ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ సస్పెండ్..

ABN, First Publish Date - 2023-06-21T15:36:35+05:30

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar)ను ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) నుంచి సస్పెండ్ (Suspend) చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా? అని ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్ 5న తన పార్టీలో గద్దర్ చేరారని.. తాను మునుగోడులో ఎన్నికల ప్రచారానికి దిగుతున్నానని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో గద్దర్‌తో డీల్ కుదుర్చుకున్నారని... దాంతో తాను గద్దర్ ఇంటికి వెళితే.. ఆయన భార్య, కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నారని కేఏ పాల్ చెప్పారు.

అలాగే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి ప్రజాశాంతి పార్టీలో చేరితే.. మూడు నెలలు ఆయనకు నరకం చూపించి, కిడ్నానాప్ చేసి, ప్రజాశాంతి ఆఫీస్‌పై దాడులు చేశారని, పోలీసులు వచ్చినా ఆయనను కాపాడలేకపోయారని కేఏ పాల్ అన్నారు. ఎన్ని లక్షల మందిని అరెస్టు చేయగలరని ప్రశ్నించారు. 31 లక్షల మంది తన పార్టీలో చేరారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90 శాతం ఉన్నారని, 75 ఏళ్లుగా పాలిస్తున్న దొరలు ఒక శాతం, కమ్మవారు 3 శాతం, రెడ్లు 5 శాతం ఉన్నారన్నారు. 90 శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లింలు అధికారాన్ని చేపట్టకూడదా? అని పాల్ ప్రశ్నించారు.

Updated Date - 2023-06-21T15:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising