ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

GHMC Meeting: బీజేపీ కార్పొరేటర్లకు తెలుగు, ఇంగ్లీష్ రాదు.. బల్దియా సమావేశంలో మేయర్ హేళన

ABN, First Publish Date - 2023-08-23T11:16:56+05:30

జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన, మేయర్ ఆగ్రహంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం (GHMC Council Meeting) రసాభాసగా మారింది. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన, మేయర్ ఆగ్రహంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. బుధవారం ఉదయం మేయర్ విజయలక్ష్మి (Mayor Vijayalaxmi) అధ్యక్షతన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మొదలైంది. అయితే శానిటేషన్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు (BJP Corporators) ఆందోళనకు దిగారు. తీర్మానం చేయాలంటూ సభలో డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మేయర్ తీరుపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. బీజేపీ కార్పొరేటర్లకు తెలుగు, ఇంగ్లీషు రాదంటూ మేయర్ హేళనగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్పొరేట్లకు అర్థం కావాలంటే ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. దీంతో మేయర్‌ తీరుపై మండిపడ్డ బీజేపీ కార్పొరేటర్లు.. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల మధ్య పోటాపోటీ వాగ్వాదం నెలకొంది. సభలో ఒకరి ప్రసంగాన్ని మరొకరు అడ్డుకుంటున్న పరిస్థితి. బీజేపీ కార్పొరేటర్లపై సీరియస్ అయిన మేయర్ విజయలక్ష్మి ఒకానొక సమయంలో సహనం కోల్పోయారు. బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే మార్షల్స్‌తో బయటికి పంపిస్తా అంటూ సభ్యులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-23T11:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising