TS GOVT: తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు గుడ్ న్యూస్
ABN, First Publish Date - 2023-09-12T16:49:14+05:30
తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల(Anganwadi teachers and helpers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల(Anganwadi teachers and helpers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును నిర్దేశించారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద లక్ష రూపాయలు. అంగన్వాడీ టీచర్లకు లక్ష, హెల్పర్లకు 50 వేలు చొప్పున భృతిని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. మధురనగర్‌లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంగళవారం నాడు అంగన్వాడీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అత్యధికంగా అంగన్‌వాడీల వేతనాలను పెంచారని మంత్రి గుర్తు చేశారు. దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ముందుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంగన్వాడీలకు అరకొరగా జీతాలు ఇస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
Updated Date - 2023-09-12T16:49:14+05:30 IST