ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్

ABN, First Publish Date - 2023-09-27T17:59:08+05:30

సిటీలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(Heavy Rain) పడుతోంది. నగరంలో బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది.

హైదరాబాద్: సిటీలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(Heavy Rain) పడుతోంది. నగరంలో బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. అయితే బుధవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట, మెహదీపట్నం, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం పడుతుండడంతో నిమజ్జనం ఏర్పాట్లకు ఆటంకంగా మారింది. ట్యాంకుబండ్ ప్రాంతాల్లో నిమజ్జనానికి నగర వాసులు భారీగా తరలి వస్తోండడంతో వర్షంలోనే తడిసి ముద్దవుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనదారులు వానలోనే తడుస్తూ ఇళ్లకు బయలు దేరారు. బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ జీహెచ్ఎంసీని అలర్ట్ చేసింది.

Updated Date - 2023-09-27T18:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising