ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: బిజినెస్ చేసుకోవడానికి ఇదే దొరికిందా..? మహిళగా ఇది ఒక కళంకం

ABN, First Publish Date - 2023-03-21T19:33:27+05:30

ఇది మహిళలు చేసే బిజినెస్సేనా..? లిక్కర్ స్కాంలో ఆడవాళ్లు ఉంటారా..? అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారు.. టూ బ్యాడ్.. ఇది పరాకాష్ట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Hyderabad: ఇది మహిళలు చేసే బిజినెస్సేనా..? లిక్కర్ స్కాంలో ఆడవాళ్లు ఉంటారా..? అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారు.. టూ బ్యాడ్.. ఇది పరాకాష్ట. బిజినెస్ చేసుకోవడానికి ఇదే దొరికిందా..? మహిళగా ఇది ఒక కళంకం అని ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఘాటుగా స్పందించారు. నిజంగా ఎమ్మెల్సీ కవిత తప్పు చేయకుంటే చట్టానికి సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు.

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ రాజకీయ కుట్ర అయితే అది ఈ రాష్ట్రంలోనీ వారిమీదనే విచారణ జరగాలి. కానీ కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల చెందినవారిని విచారణ చేస్తున్నారు. దేశ రాజధానిలో జరిగిన లిక్కర్ స్కాం 6,7 రాష్ట్రాల రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు ఇన్వాల్వ్ అయ్యాయి. రాజకీయ కుట్ర అయితే కోర్టు తేలుస్తుంది, మీరెందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు.

తప్పు చేస్తే నా కొడుకు అయినా, బిడ్డనైనా వదిలిపెట్టను అని స్వయంగా అసెంబ్లీలో సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారు. మరి తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఈటెల నిలదీశారు. రాజకీయపరమైన వేధింపులు అని రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారని కొట్టిపారేశారు. తెలంగాణలో సంపాదన సరిపోదు అన్నట్టుగా కేసీఆర్ కుటుంబ పాలనలో ఢిల్లీ దాకా ఎగపాకారు. రాజకీయపరంగా వేధింపులకు పాల్పడితే ఆ కేసు కోర్టులలో నిలవదు. తప్పు చేశారా లేదా అనేది ఏజెన్సీలు తెలుస్తాయి. అన్ని ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే, చట్టంపై మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నవాళ్లం.. తప్పు చేసిన వారు తప్పంచుకోలేరని ఈటెల రాజేందర్ అన్నారు.

సీఎం కేసిఆర్ అబద్ధాలను కూడా ప్రజలను నమ్మించే విధంగా చెప్పగలరు. మీరు దోచుకోండి.. దాచుకోండి.. మీకు ఆపద వచ్చినప్పుడు మీకు అండగా ఉంటామని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏమన్నా కేసీఆర్ కుటుంబానికి రాసి ఇచ్చారా? అని ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. మీకు కష్టం రాగానే కాపాడండి అని అడగడానికి ఎమ్మెల్సీ కవితకు సపోర్ట్‌గా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎలా వెళ్తారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంకి అడ్వకేట్ జనరల్‌కు ఏంటి సంబంధం.. మంత్రులకు లిక్కర్ స్కాంకి ఏం సంబంధం.. ప్రజల సొమ్ము ఇలా ఎందుకు ఖర్చు పెడుతున్నారని నిలదీశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణ విషయంలో సీఎం కేసీఆర్ తీరును బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తప్పుబట్టారు. దారిలో పోయే దానయ్య కంప్లైంట్ చేస్తే నన్ను తీసివేసావ్.. కనీసం విచారణ చేశావా? చేయకుండానే తీసి వేస్తివి.. హుజురాబాద్ వస్తివి..దెబ్బలు తింటివి..ఈటల రాజేందర్ తప్పు చేశారా? కేసీఆర్ చేశారా అని అడిగితే ప్రజలు తేల్చి చెప్పారన్నారు. మీమీద ఆరోపణలు వస్తే మాత్రం విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు వెనక్కు పోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-21T19:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising