ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Metro: మెట్రో యాజమాన్యంతో ఉద్యోగుల చర్చలు విఫలం

ABN, First Publish Date - 2023-01-04T18:30:36+05:30

జీతం పెంపు డిమాండ్‌తో సమ్మె చేస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail Employees) ఉద్యోగులతో యాజమాన్యం (Metro management) చర్చలు విఫలమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జీతం పెంపు డిమాండ్‌తో సమ్మె చేస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail Employees) ఉద్యోగులతో యాజమాన్యం (Metro management) చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుత జీతానికి రూ.800 మాత్రమే పెంచుతామని, విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించింది. అయితే జీతం స్వల్పంగా పెంచుతామనడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. యథావిధిగా సమ్మె కొనసాగిస్తామన్న మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది తేల్చిచెప్పారు. బుధవారం 3 కారిడార్లలోని సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని ఉద్యోగుల వెల్లడించారు.

రెండో రోజు సమ్మె..

కాగా జీతాల పెంపు, సదుపాయాల కల్పన డిమాండ్లతో హైదరాబాద్ మెట్రో రైల్ ఉద్యోగులు మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం కూడా ఈ సొమ్ము కొనసాగింది. మెట్రో టికెటింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి ఉప్పల్ మెట్రో డిపో ముందు ఆందోళన చేశారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ ఏజెన్సీ ప్రతినిధులు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని సిబ్బంది చెప్పారు. దాదాపు ఐదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ జీతం ఏమాత్రం పెంచకుండా అతి తక్కువ వేతనంతో తమను శ్రమ దోపిడీ చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. సమ్మెలో పాల్గొన్నవారిలో ప్రధానంగా టికెటింగ్ సిబ్బంది ఉన్నారు. యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండవ రోజు కూడా ఉప్పల్ డిపో వద్ద ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు. సమ్మె మొదలుపెట్టిన మంగళవారం సాయంత్రం యాజమాన్యం ఒక లేఖ పంపించిందని, ఉద్యోగంలో చేరకపోతే జీతాలు పెంపు ఉండబోదని అందులో హెచ్చరించారని ఓ ఉద్యోగి చెప్పారు. కేవలం 800 మాత్రమే జీతం పెరుగుతుందని, ఉద్యోగులు భావిస్తున్నట్టు ఇక్కడ ఏమీ ఉండబోవని ఆ లేఖలో పేర్కొన్నారని వాపోయారు. ఉద్యోగాలు పోయినా ఫర్లేదు. కానీ ఇన్నేళ్లు ఉద్యోగం చేసి తమకు లాభం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అందుకే కార్మిక సంఘం హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఉద్యోగులు చెప్పారు. హక్కులు అమలు చేసిన తర్వాతే ఉద్యోగంలో చేరతామని తెలిపారు. ఉద్యోగంలో చేరాలంటూ యాజమాన్యం చెబుతోంది కానీ వాళ్లు చెప్పినట్టే పాటించాలని అంటున్నారని ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యోగులు చెప్పారు.

మరో ఉద్యోగి మాట్లాడుతూ.. యాజమాన్యం నుంచి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు. మంగళవారం సమ్మె చేస్తున్న ఉన్నతాధికారులు ఎవరూ వచ్చి జీతం పెంచుతామని హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు. అయితే ఇలాగే వ్యవహరిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ నోటీసు పెట్టారని వివరించారు. స్టేషన్‌కు 20 మంది చొప్పున మొత్తం 1000 మంది వరకు ఉంటామని తెలిపాడు. ఇప్పటికిప్పుడు ఉద్యోగులను తొలగించబోరని మరో ఉద్యోగి ఆశాభావం వ్యక్తం చేశాడు. తమను తొలగించినా సంస్థకే ఇబ్బందులు ఎదురవుతాయని, కొత్తవారితోపని చేయించుకోవడం అంతసులభం కాదని దీమా వ్యక్తం చేశాడు. కనీస సదుపాయాలు మినహా ఇంకేమీ కోరడంలేదని తెలిపాడు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంలేదని పేర్కొన్నాడు. రోజుకు 12 - 16 గంటలపాటు పని చేయించుకున్నా జీతాలు కూడా సరిగా చెల్లించలేని పరిస్థితి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. జీతాలు పెంచేవరకు సమ్మె విరమించబోమని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు.

Updated Date - 2023-01-04T18:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising