ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderbad Fire Accident: స్వప్పలోక్ కాంప్లెక్ అగ్నిప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి..

ABN, First Publish Date - 2023-03-18T11:06:22+05:30

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే.. వారంతా ఐదో అంతస్తులోని కాల్‌ సెంటర్‌ సిబ్బంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే.. వారంతా ఐదో అంతస్తులోని కాల్‌ సెంటర్‌ సిబ్బంది. మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే. మృతులంతా 5వ అంతస్తులో ఉన్నవారేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న కొంతమందిని రక్షణ బృందాలు నిచ్చెన సాయంతో రక్షించాయి. 4,5 అంతస్తుల నుంచి 12 మందిని రెస్క్యూ టీమ్‌ బయటకు తీసుకొచ్చింది. మరో ఆరుగురు ఐదో అంతస్తులో ఉన్నారని తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లే సరికి వారు స్పృహ తప్పి పడిపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

అయితే మెట్ల మార్గం మూసివేసి ఉండటం వల్లే తీవ్రస్థాయిలో ప్రాణనష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. ఆ ఆరుగురు అగ్నిప్రమాద భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. మెట్ల మార్గం గుండా దారిలేకపోవడం, మొత్తం చెత్త, పనికిరాని వస్తువులతో నింపేయడం, బయటకు వచ్చే తలుపులు లాక్‌ చేసి ఉండడంతో మధ్య వరకు వచ్చిన వారు తిరిగి 5వ అంతస్తులోకి వెళ్లి రూమ్‌ నంబర్‌ 510, 511 గదుల్లో చిక్కుకున్నట్లు గుర్తించారు.

Updated Date - 2023-03-18T11:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising