Sharmila: నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..?
ABN, First Publish Date - 2023-05-24T14:17:05+05:30
హైదరాబాద్: టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నాది ఆంధ్ర అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడ..? ఆమెది ఇటలీ కదా’ అని ప్రశ్నించారు.
హైదరాబాద్: టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నాది ఆంధ్ర అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడ..? ఆమెది ఇటలీ కదా’ అని ప్రశ్నించారు. ఒక ప్రాంతాన్ని వదిలేసి.. సొంత వాళ్ళను కాదనుకొని... ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు .. బిడ్డలను కనీ తనని తానే అంకితం చేస్తుంది మహిళ అని అన్నారు. ఇది మన దేశ సంస్కృతి, గొప్పతనమని, ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలనుకుంటే సంస్కారం ఉండాలని, ఇంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదన్నారు.
రేవంత్ రెడ్డి అభద్రతగా ఫీల్ అవుతున్నారని, తన వల్ల ఆయన ఉనికి ఎక్కడ పోతుందో అని భయంగా ఉందని, అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని షర్మిల అన్నారు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ.. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ (YSRTP) అని అన్నారు. జై తెలంగాణ అనే హక్కు రేవంత్ రెడ్డి, కేసీఅర్ (KCR), మోదీ (Modi), సోనియా (Sonia)లకు లేదన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అని.. ముందు ఆ సంగతి ఏంటో రేవంత్ రెడ్డి చూడాలని షర్మిల వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-05-24T14:17:05+05:30 IST