ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Journalist Zaheer : జహీర్‌కు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నివాళి

ABN, First Publish Date - 2023-08-08T08:55:59+05:30

నిన్న రాత్రి హఠాత్తుగా మృతి చెందిన మానవతావాది, సుప్రసిద్ధ పాత్రికేయులు, సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ అంత్యక్రియలు ఇవాళ తెల్లవారుజామున నాంపల్లిలో జరిగాయి.

హైదరాబాద్ : నిన్న రాత్రి హఠాత్తుగా మృతి చెందిన మానవతావాది, సుప్రసిద్ధ పాత్రికేయులు, సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ అంత్యక్రియలు ఇవాళ తెల్లవారుజామున నాంపల్లిలో జరిగాయి. ఈ అంతిమయాత్రలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్.యు.జె) కార్యదర్శి షౌకత్ హమీద్, మాజీ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, తెలంగాణ జనసమితి పార్టీ(టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, జనం సాక్షి సంపాదకులు రెహ్మాన్ తదితరులు హాజరై జహీర్ అలీ ఖాన్ కు నివాళి అర్పించారు.

లౌకికవిలువల పరిరక్షణే ధ్యేయంగా నిరంతరం పోరాడుతూ, సామాజిక ఉద్యమాల్లో ముందుండే మానవతావాది.. సియాసత్‌ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌(63) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం గద్దర్‌ అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన.. కార్డియాక్‌ అరెస్టుతో హఠాన్మరణం చెందారు. తనకు ఎంతో ఆప్తుడైన గద్దర్‌ మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురైన జహీరుద్దీన్‌.. తొలుత అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని చూశారు. సోమవారమంతా ఎల్‌బీ స్టేడియంలోనే ఉండిపోయారు.

గద్దర్‌ పార్థివ దేహాన్ని తరలిస్తున్న వాహనంలోనే ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి.. మహాబోది స్కూల్‌ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అప్పటికి సాయంత్రం ఆరున్నర గంటలు కావొస్తోంది. ఇంతలో ఆయనకు ఒక ఫోన్‌ కాల్‌ రావడంతో స్కూల్‌ ప్రాంగణం నుంచి బయటకు వచ్చారు. ఫోన్‌ మాట్లాడుతున్న క్రమంలోనే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆయన కుప్పకూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆయన వాంతులు చేసుకుంటుండడంతో అక్కడున్నవారు సీపీఆర్‌ చేసి, ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే ఆయన కార్డియాక్‌ అరెస్టుతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

Updated Date - 2023-08-08T08:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising