ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth reddy: ఈరోజు ప్రధానంగా ఆ ముగ్గురిని స్మరించుకోవాలి

ABN, First Publish Date - 2023-08-15T10:58:58+05:30

140 కోట్ల భారతీయులందరికీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీభవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు.

హైదరాబాద్: 140 కోట్ల భారతీయులందరికీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీభవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence day Celebrations) ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆపై గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలన్నారు. ‘‘అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ (Mahatma Gandhi).. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారు అంబేద్కర్ (Ambedkar).. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ (Nehru). ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ (Indiragandhi) అని కొనియాడారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv gandhi) అని తెలిపారు. అలాగే దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించింది పీవీ, మన్మోహన్ అని పేర్కొన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ అవలంబిస్తోందని విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్ఫూర్తి నింపారన్నారు. నెహ్రూ నుంచి మన్మోహన్ (Manmohan) వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజేపీ (BJP) వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు.. కానీ పెరిగింది గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అని వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. మణిపూర్ మండుతుంటే మోదీ (Narendra modi), అమిత్ షా (Amit shah) కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి, కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారన్నారు. నియంతలకంటే నికృష్టాంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


మేము వస్తేనే....

ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే, సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లే అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై తాము వచ్చాక సమీక్షిస్తామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని... 10వేల ఎకరాలు దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తుంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తిరగబడదాం తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదామని పిలుపునిచ్చారు. ప్రతీ గడపకు వెళ్లి ప్రతీ తలుపు తడదామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామంటూ నేతలకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-08-15T10:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising