ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivakumar: నా బాధ్యత అంతవరకే..

ABN, First Publish Date - 2023-12-05T13:30:55+05:30

Telangana: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని సీఎల్పీ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి నివేదించేందుకు తెలంగాణ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు.

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని సీఎల్పీ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి నివేదించేందుకు తెలంగాణ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Karnataka Deputy Chief Minister DK Shivakumar) ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. సీఎల్పీ నిర్ణయాన్ని అధిష్టానానికి చెప్పడం వరకే తన పని అని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ఉంటుందని సీఎల్పీ తీర్మానం చేసిందని తెలిపారు. సీఎల్పీ అభిప్రాయాన్ని నివేదికను అందించడానికి ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. తన బాధ్యత అంతవరకే అని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని డీకే శివకుమార్ వెల్లడించారు.


కాసేపటి క్రితమే ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసానికి డీకే శివకుమార్ చేరుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి వివరించనున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో అధిష్టానానికి అందించనున్నారు. ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ, కేసీ చేసి వేణుగోపాల్ ఇప్పటికే చేరుకున్నారు.

Updated Date - 2023-12-05T13:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising