ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR: అదానీ రూపంలో దేశానికి మరో ఉపద్రవం వచ్చింది. ఆయన గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?

ABN, First Publish Date - 2023-02-12T15:49:47+05:30

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు. దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని, దేశంలోని పరిస్థితులపై సుదీర్ఘ చర్చ జరగాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అదే పరిస్థితి ఉందని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. నర్సింగ్‌ కాలేజీల విషయంలోనూ తీవ్ర అన్యాయం చేశారని, దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని, ఇదేనా ఫెడరల్‌ వ్యవస్థ? అంటే అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు రావాల్సిన రూ.495 కోట్లు ఏపీకి ఇచ్చారని, 7 ఏళ్లుగా అడుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని, గతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వమన్నారని కేసీఆర్‌ గుర్తు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో తాగునీరు లేని దుస్థితి ఉందని, మాటలు కోటలు దాటుతున్నాయి కానీ తిప్పలు తప్పడం లేదని కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా (America)లో గ్రీన్‌కార్డు (Green Card) దొరికితే సంబరాలు చేసుకుంటున్నారని, మోదీ పాలనలో 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని, ఇంత దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎందుకు వచ్చింది? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ (Congress) దేశంలో పనిచేయడం లేదని 2014లో మోదీకి ఓటేశారని, మన పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని కేసీఆర్‌ తెలిపారు. ప్రధానిగా మోదీ కన్నా మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) ఎక్కువ పనిచేశారని, కానీ మన్మోహన్‌ సింగ్‌ ఎలాంటి ప్రచారాలు చేసుకోలేదని కేసీఆర్‌ చెప్పారు.

ది లాస్ట్‌ డికేడ్‌ బుక్‌ను గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన కేసీఆర్‌, దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని,.. ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. మోదీ గెలిచారు.. బీజేపీ (BJP) గెలిచింది.. కానీ దేశ ప్రజలు ఓడారని, అన్ని రంగాల్లో దేశం తీవ్రంగా నష్టపోయిందని, దేశం దివాళా తీసినా తమదే పైచేయి అంటున్నారని కేసీఆర్ విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం అధ్వాన్నంగా ఉందని, అదానీ గురించి మోదీ ఎందుకు మాట్లాడడం లేదని, అదానీ (Adani) రూపంలో దేశానికి మరో ఉపద్రవం వచ్చిందని కేసీఆర్‌ ఆరోపించారు.


దేశంలో ఇంత జరుగుతున్నా అదానీ గురించి ఎందుకు మాట్లాడరు?, అదానీ ఆస్తి కరిగిపోయింది.. ఆయన సంస్థలు ఉంటాయో?.. పోతాయో?, కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చారని, అదృష్టం బాగుండి అదానీ కంపెనీలు రాష్ట్రంలోకి రాలేదని కేసీఆర్‌ తెలిపారు. ఇక్కడ లేని నెహ్రూ (Nehru) , ఇందిరాగాంధీ (Indira Gandhi) పేర్లతో ఇప్పుడు రాజకీయం ఎందుకు?, రాహుల్‌ (Rahulgandhi), మోదీ ఒకరిపై ఒకరు విమర్శించుకోవడానికే పార్లమెంట్‌లో పరిమితం అయ్యారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-12T15:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising