Kishan Reddy : కేంద్ర నిర్ణయాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలు స్వాగతించారు
ABN, First Publish Date - 2023-12-11T21:56:08+05:30
కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలు స్వాగతించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) పేర్కొన్నారు. సోమవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 372 రద్దు చేయడం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్ అంశంలో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఢిల్లీ : కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలు స్వాగతించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) పేర్కొన్నారు. సోమవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 372 రద్దు చేయడం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్ అంశంలో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ మరో పాలస్తీనా అవుతుందని కొందరు విపక్ష నేతలు ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిసున్నాము. ఇతర రాష్ట్రాల్లాగే జమ్మూకాశ్మీర్‌కి సమాన హక్కులు ఉండాలి. జమ్మూకాశ్మీర్‌లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలి. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం కూకటివేళ్లతో పెకిలించాలి. యువత చేతిలో కంప్యూటర్లు, బుక్స్ పెట్టాలి. హింసతో అట్టుడికిన జమ్మూకాశ్మీర్‌లో కొత్త ఆశలు వెల్లువిరిస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుతో బాధపడుతున్నారు. ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-12-11T21:56:09+05:30 IST