TS News: కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్?
ABN, First Publish Date - 2023-10-23T11:05:32+05:30
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో 40 రోజుల్లో జరగనున్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు, మేనిఫెస్టోలు, జంపింగ్‌లపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్నాయి. గట్టిగా 37 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ఎంపిక, మేనిఫెస్టోలు, జంపింగ్‌ల హడావుడి నడుస్తోంది. ముఖ్యంగా నేతల పక్కచూపులు సర్వత్రా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏమాత్రం మొహమాటం లేకుండా తిట్టిన పార్టీలోకే వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ (Big Shock for BJP) తగలొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఆ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యే (Ex MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), మాజీ ఎంపీ వివేక్ (Vivek) కాంగ్రెస్ (Congress)లోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో వారు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి మునుగోడు (Munugodu) కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇదే విషయమై తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వివేక్ కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరోలో ఉంటారని తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరితే తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీలోనే కొనసాగినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే.
Updated Date - 2023-10-23T11:51:01+05:30 IST