Hyderabad: మాదాపూర్ రేవ్ పార్టీ కేసు విచారణ వేగవంతం..
ABN, First Publish Date - 2023-08-31T08:52:59+05:30
హైదరాబాద్: మాదాపూర్ రేవ్ పార్టీ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సినిమా ఫైనాన్సర్ వెంకట్ అధ్వర్యంలో మాదాపూర్, విఠల్‌రావునగర్, వైష్ణవి అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరిగింది.
హైదరాబాద్: మాదాపూర్ రేవ్ పార్టీ కేసు (Rave Party Case) విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సినిమా ఫైనాన్సర్ వెంకట్ (Cinema Financier Venkat) అధ్వర్యంలో మాదాపూర్, విఠల్‌రావునగర్, వైష్ణవి అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఢమరుకం, పూల రంగుడు, లౌవ్లీ, ఆటో నగర్ సూర్య తదితర సినిమాలకు వెంకట్ ఫైనాన్సియర్‌గా ఉన్నారు. గోవా (Goa) నుంచి డ్రగ్స్ (Drugs) తెచ్చి పార్టీలు నిర్వహిస్తున్నాడు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిఘా పెట్టారు. నిందితుల వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట్ వాట్సాప్ చాట్‌ను పోలీసులు పరిశీలించారు.
వివరాల్లోకి వెళితే...
మాదాపూర్‌లో రేవ్ పార్టీని నార్కోటిక్ బ్యూరో పోలీసులు (Narcotic Bureau Police) భగ్నం చేశారు. విఠల్‌రావునగర్, వైష్ణవి అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. భారీగా కొకైన్ (Cocaine), ఎల్ఎస్‌డీ డ్రగ్స్ (LSD Drugs) స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఓ సినీ నిర్మాతతోపాటు పలువురిని అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు యువతులు ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరుపరి విచారణకు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.
పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరన్నదానిపై మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పట్టుపడ్డ యువతి యువకులు వద్ద నుంచి కోకైన్, ఎల్ఎస్‌డీ డ్రగ్స్, గాంజాయితో పాటు రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు యువతులు ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
Updated Date - 2023-08-31T08:52:59+05:30 IST