Madhusudan Reddy : రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదు
ABN, First Publish Date - 2023-12-12T20:09:35+05:30
రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ( Revanth Reddy Govt ) పడగొట్టడం ఎవరి తరం కాదని పీసీసీ జనరల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి ( Madhusudan Reddy ) అన్నారు.
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ( Revanth Reddy Govt ) పడగొట్టడం ఎవరి తరం కాదని పీసీసీ జనరల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి ( Madhusudan Reddy ) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకున్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 100 గంటల నుంచి మా ప్రభుత్వం ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో పడిపోతుందని అంటున్నారు..నీకు అంత దమ్ముందా.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి నీ అక్రమ ఆస్తులు, ఫెక్ యూనివర్సిటీ బయటకు తీస్తాం. సీఎం రివ్యూ చేస్తుంటే జైలుకు వెళ్తామనే మీ నేతల్లో భయం పట్టుకుంది. రాష్ట్రంలో ప్రజాపాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం. 100 గంటల్లోనే 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేశాం.బీఆర్‌ఎస్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-12-12T20:09:38+05:30 IST