ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: బీజేవైఎం నేతలపై మైనంపల్లి అనుచరుల దాడి.. ఈ దాడికి కారణమేంటంటే..?

ABN, First Publish Date - 2023-09-13T21:52:04+05:30

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MLA Mainampally Hanumantha Rao) అనుచరులు రాక్ ల్యాండ్ అవెన్యూలో బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు మైనంపల్లి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

హైదరాబాద్: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MLA Mainampally Hanumantha Rao) అనుచరులు రాక్ ల్యాండ్ అవెన్యూలో బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు మైనంపల్లి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా మైనంపల్లి హనుమంతరావు అనుచరులు అక్కడికి చేరుకొని బీజేవైఎం నాయకులపై దాడికి పాల్పడ్డారు.రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా వారిని పరిగెత్తించి కొట్టారు. మైనంపల్లి అనుచరుల దాడిలో బీజేవైఎం నాయకులకు గాయాలయ్యాయి. రాక్ ల్యాండ్ అవెన్యూలో మైనంపల్లి అనుచరులు కబ్జా చేశారని ఆరోపణల నేపథ్యంలో బీజేవైఎం నాయకులను బాధితులు ఆశ్రయించారు. బీజేవైఎం నాయకులకు మైనంపల్లి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని గొడవ ముదిరింది.ఈ ఘర్షణలో అల్వాల్ పోలీసులు మైనంపల్లి వర్గానికి మద్దతుగా నిలిచారని బీజేవైఎం నాయకులు ఆరోపణలు చేశారు. ఈఘటనపై బీజేపీ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-09-13T21:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising