Minister Errabelli: కొంచెమైనా సిగ్గు అనిపించలేదా బండి సంజయ్?
ABN, First Publish Date - 2023-04-07T14:14:03+05:30
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Minister Errabelli Dayakar Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Minister Errabelli Dayakar Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంజయ్ బెయిల్ (Bail) తెచ్చుకొని బయటికి వచ్చి విజయం సాధించానని విర్రవీగుతున్నారని, దొంగలందరికీ బెయిల్ వస్తుందని అన్నారు. కోర్టు నిర్దోషి అని చెబితేనే విజయం సాధించినట్టని, సీపీపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నీ నియోజకవర్గంలో పేపర్ లీక్ అయితే కనీసం పోలీసులకు కూడా చెప్పకుండా రాజకీయం చేశావు.. నీకు కొంచెమైనా సిగ్గు అనిపించలేదా బండి సంజయ్?.. పేపర్ లీక్ గంట ముందు మీరిద్దరు మాట్లాడుకున్నారని సీపీ చెప్పారు.. నువ్వు దొరికినవ్ కాబట్టి నీ ఫోన్ పోలీసులకు ఇవ్వలేదు’’ అని విమర్శించారు.
ఎన్ని పాపాలు అయిన చేసి, అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. మొన్నటి వరకు మత రాజకీయాలు చేశారని, ఇప్పుడు లీకు రాజకీయాలు చేస్తున్నారని.. లంగతనం చేసి జైలుకు వెళ్లిన సంజయ్‌కు, సీఎం కెసీఆర్‌కు తేడా లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామంటున్నారు.. కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఒప్పుకుంటున్నారన్నారు. గ్యాస్ సిలెండర్‌ను రూ. 200కు ఇస్తామని స్వయంగా ప్రధాని మోదీ చెప్పలేదా?.. అధికారంలోకి వచ్చాక అమలు చేశారా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చార్మినార్ దగ్గర.. అలాగే మునుగోడు ఎన్నికల్లో తడి బట్టలతో బండి సంజయ్ యాదాద్రి దగ్గర ప్రమాణం చేశారని.. బీజేపీ గెలుస్తుందని అన్నారని.. కానీ గెలిచారా? అని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డవి, అమిత్ షా చెప్పులు మోస్తావా సిగ్గులేదా? అంటూ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
Updated Date - 2023-04-07T14:14:03+05:30 IST