ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఫోకస్..
ABN, First Publish Date - 2023-06-28T10:59:55+05:30
తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఇటు మంత్రి కేటీఆర్ ఒకరిపై మరొకరు ఎక్కడలేని ప్రేమ కురిపించుకుంటున్నారు. ఈటల ఇలా తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. అలా మంత్రి కేటీఆర్ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేశారు.
హైదరాబాద్ : తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఇటు మంత్రి కేటీఆర్ ఒకరిపై మరొకరు ఎక్కడలేని ప్రేమ కురిపించుకుంటున్నారు. ఈటల ఇలా తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. అలా మంత్రి కేటీఆర్ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం సెక్యురిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల మాటల నేపథ్యంలో భద్రత పెంపుపై డీజీపీ సమీక్ష చేయనున్నారు.
ఈటల సైతం స్వరం మార్చారు. గతంలో మాదిరిగా కేసీఆర్‌పై కత్తులు, మిరియాలు నూరడం లేదు. తాజాగా తనకు బీఆర్ఎస్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌పై కేసీఆర్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదని.. బీఆర్ఎస్ నుంచి తనను వెళ్ళగొట్టినప్పుడు మంత్రి కేటీఆర్ సహా.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారని చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆయనను బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టింది ఎవరు? ఎవరో వెళ్లగొడితే ఈయన మూటా ముల్లె సర్దేసుకుని బయటకు వచ్చారా? అనేది ఆసక్తికరం. మొత్తానికి అటు బీఆర్ఎస్ కానీ.. ఇటు ఈటల కానీ ఒకరిపై మరొకరు ఒక సాఫ్ట్ కార్నర్‌లో నడుచుకోవడమనేది ఆసక్తికరంగానూ.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానూ మారింది.
Updated Date - 2023-06-28T11:59:43+05:30 IST