ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mallareddy: మోదీపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-10T22:39:57+05:30

తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తుంటే ఐటీ అధికారులు తమ సంస్థలపై దాడులు చేశారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఐటీ, ఈడీ దాడులు తనపై చేస్తే ఏం దొరుకుతాయని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender), మాజీ ఎంపీ వివేక్‌పై (former MP Vivek) ఐటీ (IT), ఈడీ (ED) దాడులు చేస్తే చాలా దొరుకుతాయని మల్లారెడ్డి సూచించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ (Modi) చాయి ఆమ్మి.. ముఖ్యమంత్రి అయ్యారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయ్యారని మంత్రి అన్నారు. ఇప్పుడు తన అలవాటు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై, కేటీఆర్ గురించి తనదైన శైలిలో మాస్ డైలాగులు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రుల పాలన నడుస్తోందని... రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్.. అంటూ కేసీఆర్, కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు తెలంగాణకు ఐటీ రాజ్యం అనే పేరు తెచ్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉద్యమ చంద్రుడు ఇవాళ సూర్యుడు అయ్యారని, ఇప్పుడు మండుతున్న సూర్యుడిని తట్టుకోగలరా? అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. త్వరలో కేసీఆర్ పీఎం అవుతారని.. కేటీఆర్ సీఎం అవుతారని మల్లారెడ్డి జోస్యం చెప్పారు.

Updated Date - 2023-02-10T22:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising