ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Puvvada Ajaykumar: ‘బయ్యారంపై బీజేపీ నేతలు చెప్పేవన్నీ అసత్యాలే’

ABN, First Publish Date - 2023-04-12T13:05:35+05:30

ఏపీ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay kumar) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బయ్యారంలో ఉక్కు నిక్షేపాలు ఉన్నాయని జాతీయ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చెప్పిందన్నారు. అయితే బయ్యారంలో క్వాలిటీ ఫెర్రస్ లేదని బీజేపీ నేతలు (BJP Leaders) అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. బైలాడిల్లా ఐరన్ కంపెనీని జపాన్, కొరియా కంపెనీకి లీజుకు ఇచ్చారన్నారు. బైలాడిల్లా నుంచి ఐరన్ ఓర్‌ను 1800 కిలోమీటర్లు ఉన్న ముంద్రాకు తరలిస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా సమస్యలను భట్టి ఎప్పుడైనా పట్టించుకున్నారా అని నిలదీశారు. సమస్యలు వదిలేసి భట్టి ఎక్కడో పాదయాత్ర చేస్తున్నారన్నారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమపై కాంగ్రెస్ (Congress) ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేకమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. తమ చేతుల్లో ఉంటే బయ్యారం ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేదని చెప్పారు. అసెంబ్లీకి మమ్మల్ని పంపాల్సింది ప్రజలు... నేతలు కాదన్నారు. బయ్యారంలో 6 లక్షల మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉందని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-12T13:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising