ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సత్వరం చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN, First Publish Date - 2023-08-13T11:51:33+05:30

హైదరాబాద్: ఓ పత్రిక (ఆంధ్రజ్యోతి)లో ఆదివారం ఉదయం వచ్చిన వార్తపై విచారణ జరపాలని ఆదేశించామని, ఆ అధికారిని సస్పెండ్ చేసామని, ఘటనపై విచారణ చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

హైదరాబాద్: ఓ పత్రిక (ఆంధ్రజ్యోతి) (Andhrajyothy)లో ఆదివారం ఉదయం వచ్చిన వార్తపై విచారణ జరపాలని ఆదేశించామని, ఆ అధికారిని సస్పెండ్ (Suspent) చేసామని, ఘటనపై విచారణ చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకుంటామని... విచారణ తరువాత చేస్తామన్నారు. అయితే హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ (Hakimpet Sports School)లో అధికారి లైంగిక వేధింపుల ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మంత్రి పేర్కొన్నారు.

కాగా హకింపేట ఓఎస్‌డి (OSD)గా పని చేస్తున్న హరికృష్ణ (Harikrishna) అనే అధికారిని సస్పెండ్ చేశామని, విచారణ రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. వారికి సహకరించిన వారిని వదలమని చెప్పారు. బ్రిజ్ భూషణ్‌ (Brij Bhushan)పై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీలో కోరామని కానీ జరగలేదన్నారు. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు విషయం తెలిస్తే అప్పుడే చర్యలు తీసుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

పూర్తి వివరాలు..

తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై ఢిల్లీ కేంద్రంగా మహిళా రెజర్లు జరిపిన ఆందోళనను మరువకముందే.. తెలంగాణలో మరో బ్రిజ్‌ భూషణ్‌ తేలాడు! నిబంధనల ప్రకారం బాలికల హాస్టల్లో పురుష అధికారులు తిష్ఠవేయకూడదు. అత్యవసరంగా అర్ధరాత్రి పూట వెళ్లాల్సి వచ్చినా మహిళా అధికారులు, మహిళా వార్డెన్ల నుంచి అనుమతి పొంది, వెళ్లి వెంటనే వచ్చేయాలి! అధికారులు ఏ విద్యార్థినైనా బయటకు తీసుకెళ్లాల్సి వస్తే తోడుగా మహిళా వార్డెన్‌ తప్పనిసరిగా ఉండాలి. సదరు అధికారి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బాలికల హాస్టల్లోని గెస్ట్‌ రూంలోనే మకాం పెట్టాడు. తమ పట్ల సదరు అధికారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ హాస్టల్లోని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. ఆ అధికారి బలవంతపెట్టడంతో అతడితో కలిసి బయటకు వెళుతున్న విద్యార్థులు, హాస్టల్‌కు వచ్చాక, అతడు తమ పట్ల చేసిన దుశ్చేష్టలను మహిళా ఉద్యోగులకు చెప్పుకొని భోరుమంటున్నారు. కాగా స్పోర్ట్స్‌ స్కూల్‌లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసనీలలు నడుపుతున్నాడని, విద్యార్థినుల పట్ల ఆయన పాల్పడుతున్న ఆగడాలకు ఆమె, మరో ఇద్దరు సీనియర్‌ కోచ్‌లు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రోజూ సదరు అధికారి కాళ్లు మొక్కాలంటూ విద్యార్థులను ఆ సీనియర్‌ కోచ్‌లు వేధిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం ఓ బాలిక ఒకరోజు కొన్ని గంటల పాటు పాఠశాల ప్రాంగణంలో కనిపించలేదు. ఆందోళన చెందిన అధికారులు పాఠశాల ప్రాంగణంలో వెతికారు. కాసేపటికి ఆ బాలిక.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గదికి ఎదురుగా ఉన్న మహిళా ఉద్యోగి గదిలో కనిపించింది. గుర్తించిన మిగతా అధికారులు మాట్లాడేందుకు వెళ్లగా.. ఆ బాలిక లోదుస్తుల్లో కనిపించడంతో నివ్వెరపోయారు. తర్వాత కొద్ది రోజులకే ఆమె అనారోగ్యం పాలైందని, నెలసరి విషయంలోనూ సమస్యలు తలెత్తాయని సమాచారం. కాగా సదరు మహిళా ఉద్యోగి వినియోగించే జడ పిన్నులు, హెయిర్‌ బ్యాండ్లు ఈ అధికారి గదిలో కనిపించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయం స్వీపర్ల ద్వారా బయటకు పొక్కుతుందని గమనించిన ఆయన, వారిని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది తన గురించే చర్చించుకుంటున్నారన్న అనుమానంతో మహిళా ఉద్యోగులనూ హెచ్చరించారని, వారిని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిసింది.

Updated Date - 2023-08-13T11:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising