Talasani Srinivas : కిషన్‌రెడ్డి, రేవంత్‌లను ఉద్దేశిస్తూ గద్దర్ భౌతిక కాయం వద్ద తలసాని సంచలన వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-08-07T11:38:34+05:30
ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతిక కాయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదన్నారు.
హైదరాబాద్ : ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతిక కాయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కొద్దిమంది అన్నీ మీ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారన్నారు. లాల్ బహద్దూర్ స్టేడియం కూడా వాళ్లే ఆరెంజ్ చేశారు అని చెప్పుకుంటున్నారన్నారు. చిల్లర రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలని తలసాని హితవు పలికారు.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణలో పూర్తిగా అనుకున్న ఆశయాలు నెరవేకుండానే గద్దర్ వెళ్లిపోయారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన ఎక్కడి ఇబ్బందులు అక్కడే ఉన్నాయని గద్దర్ భావించారన్నారు. దానిలో బాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో గద్దర్ చెప్పారని వెల్లడించారు. గద్దర్ భావించిన , ఉహించిన తెలంగాణ రాలేదని చాల బాధ పడ్డారని కిషన్ రెడ్డి తెలిపారు. నిజానికి చాలా సందర్భాల్లో గద్దర్ సైతం ఈ విషయాన్ని వెల్లడించారు.
రేవంతే చొరవ చూపారంటూ వార్తలు..
గద్దర్ భౌతిక కాయం ఆసుపత్రి నుంచి ఎక్కడికి తరలించాలనే దానిపై ఒకింత గందరగోళం ఏర్పడింది. తొలుత అల్వాల్‌లోని ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడం.. ఇంటి వద్ద తగిన స్థలం లేకపోవడంతో నిర్ణయం మార్చుకున్నారు. పలువురి సూచనల మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు తీసుకెళ్లాలనుకున్నారు. ఇంతలో గద్దర్ ఆడిపాడిన, ఆయనకు ఎంతో ఇష్టమైన నిజాం కాలేజీ గ్రౌండ్‌కు తీసుకెళ్తే బాగుంటుందని కొందరు కళాకారులు చెప్పడంతో ఆ దిశగానూ ఆలోచన చేశారు. అక్కడా అభిమానులను అదుపు చేయడం కష్టమని, చివరకు ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. సాయంత్రం. 5.30కు స్టేడియంకు తీసుకువచ్చారు. కాగా, ఎల్బీ స్టేడియంలో గద్దర్ మృతదేహాన్ని ఉంచేందుకు ప్రభుత్వం తొలుత అంగీకరించ లేదని కథనాలు వచ్చాయి. దీంతోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ చొరవ చూపి స్టేడియం గేట్లు తీసుకుని లోపలకు వెళ్లి ఏర్పాట్లు చేశారని తెలిసింది.
Updated Date - 2023-08-07T11:38:34+05:30 IST