CBN Arrest : చంద్రబాబుకు మద్దతుగా నిరసన.. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో హైటెన్షన్!
ABN, First Publish Date - 2023-10-14T11:06:07+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్లలో.. బాబు వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు, సామాన్యులు ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల హైటెన్షన్ వాతావరణం సైతం నెలకొంది. పోలీసులు-చంద్రబాబు వీరాభిమానుల మధ్య వాగ్వాదం సైతం చోటుచేసుకుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు భారీగా నిరసన కారులు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు సైతం పెద్ద ఎత్తున మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. టెక్నికల్ రీజన్ అని చెబుతూ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. మెట్రో అధికారులతో చంద్రబాబు మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు.
ఎందుకిలా..?
మరోవైపు.. నల్ల చొక్కాలు వేసుకుంటే అనుమతి లేదని మెట్రో సిబ్బంది మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణిస్తూ నిరసన తెలపాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో అన్ని మెట్రో స్టేషన్లకు టీడీపీ మద్దతుదారులు చేరుకుంటున్నారు. పొరపాటున నల్ల చొక్కాలు ధరించిన ప్రయాణికులు, మెట్రో సిబ్బందిని సైతం పోలీసులు అనుమతించడం లేదు.
చంద్రబాబు మద్దతుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. అమీర్‌పేట్, ఎంజీబీఎస్ దగ్గర మెట్రో రైళ్లను నిలిపివేశారు. ఈ ఆందోళనల నడుమ మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బాబు అభిమానులపై పోలీసుల దాడికి పాల్పడ్డారు. బ్లాక్ షర్ట్స్ ధరించిన వారిని పోలీసులు చితకబాదారు. నల్ల చొక్కాలు ధరించిన వారిని కొట్టుకుంటూ పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసుల తీరుపై చంద్రబాబు మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-10-14T11:40:27+05:30 IST