MP Arvind: కేటీఆర్‌పై ఉన్న ఆరోపణలు కిషన్‌రెడ్డిపై లేవు..
ABN, First Publish Date - 2023-07-20T16:08:55+05:30
హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న...
హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ (BJP MP) ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind).. మంత్రి కేటీఆర్ (Minister KTR), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల (Double Bedroom Houses) పరిశీలనకు వెళుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ‘‘మత్తు పదార్థాలు తీసుకుంటారని.. మంత్రి కేటీఆర్‌పై ఉన్న ఆరోపణలు కిషన్ రెడ్డిపై లేవు.. కేటీఆర్ మాదిరి బాలీవుడ్ వాళ్ళతో కిషన్ రెడ్డికి దోస్తానా లేదు.. లిక్కర్ రాణి కవిత మాదిరి.. కిషన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేవు..’’ అని అన్నారు. కిషన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బాట సింగారం.. డబుల్ బెడ్రూం ఇళ్ళకు బాట ఉంది కానీ.. సింగారం లేదని ఎద్దేవా చేశారు. పేదల ఇళ్ళ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ధర్మపురి అరవింద్ విమర్శించారు.
Updated Date - 2023-07-20T16:08:55+05:30 IST